War Between Israel and Iran Again. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం? డొనాల్డ్ ట్రంప్ కీలక...

ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం గురించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్లీ మాటమార్చారు. ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావొచ్చంటూ ఇప్పటికీ రెండు దేశాలు యుద్ధం వల్ల అలసిపోయాయని మళ్లీ ఇరాన్ ఇజ్రాయెల్ ల మధ్య ఎంపుడైనా మళ్లీ యుద్ధం జరగొచ్చని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్నదే తమ ఏకైక లక్ష్యమని అదేసమయంలో ఇరాన్‌తో వచ్చే వారమంలో అణు చర్చలు జరుపుతామని ట్రంప్ వెల్లడించారు.
ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య కొన్ని రోజులుగా భీకర యుద్ధం తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ముగిసిపోయిందంటూ ట్రంప్ చేసిన కొన్ని పోస్టులు పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అందరూ భావించిన తరుణంలో మళ్లీ యుద్ధం రావొచ్చనే అనుమానాన్ని ట్రంప్ అనటంతో ఈ ప్రశాంతతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
ట్రంప్ మాట్లాడుతూ ఇజ్రాయెల్-ఇరాన్ నేను చర్చలు జరిపాను అవి రెండూ ప్రస్తుతానికి అలిసిపోయాయి అని చెపుతూనే మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తారా? అంటే బహుశా ఏదో ఒకరోజు రావొచ్చు. త్వరలోనే మళ్లీ ప్రారంభం కావొచ్చు అంటూ ఇజ్రాయెల్- ఇరాన్ దేశాల మధ్య ఘర్షణ పునరావృతమయ్యే అవకాశం ఉందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
Comments
Post Your Comment
Public Comments: