How Amithab COVID 19 Test Positive

News

views 248

Jul 12th,2020

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని కరోనా కాటేసిన విషయం అందరికి తెలిసింది కానీ అసలు అమితాబ్ కి కరోనా ఎలా వచ్చింది అని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అమితాబ్ కు ఆయన తనయుడు అభిషేక్ కు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్దారణ కావటంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరోనా సంబంధిత తేలికపాటి లక్షణాలతో బాధపడుతున్నారని అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అమితాబ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. నిజానికి మార్చి 23న లాక్ డౌన్ ప్రారంభించిన రోజు నుంచి ఆయన పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. అయితే కొద్ది రోజుల క్రితం లాక్ డౌన్ సడలింపులు ప్రారంభమైన తరువాత అమితాబ్ తాను హోస్ట్ గా వ్యవహరించాల్సిన 'కౌన్ బనేగా కరోడ్ పతి' సెలక్షన్స్ , ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి తరువాత అమితాబ్ పాల్గొన్న కార్యక్రమం ఇదొక్కటే... అక్కడికి వచ్చిన వారిలో ఎవరిలోనో కచ్చితంగా వైరస్ ఉందని, వారి నుంచే అమితాబ్ కు సోకి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు ఆ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారో వారిలో ఎవరికి వైరస్ ఉందన్న విషయమై ఆరా తీసే పనిలో ఉన్నారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...