Most Powerful Sri Ankamma Temple Is A MUST VISIT Temple - Kaikondaigudem - మా ఊరి గ్రామ దేవేత అంకమ్మ

ఖమ్మం జిల్లా, కైకొండగూడెం గ్రామంలో వెలసిన అమ్మక్క దేవాలయం పవిత్రమైన శక్తి స్థలంగా భక్తుల మధ్య ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రధానంగా గ్రామస్తులు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు నమ్మకంతో పూజించే దేవస్థానం. ఈ ఆలయంలో అమ్మక్క తల్లి, మహా లక్ష్మమ్మ మద్ది రామమ్మ ప్రధాన దేవతలుగా కొలువై ఉన్నారు. అమ్మవారు గ్రామ దేవతగా, పరిరక్షకురాలిగా భక్తులకు శరణుగా నిలుస్తుంది.
• ప్రతి సంవత్సరం హోలీ పండుగ రోజు నుంచి 3 రోజులు జాతర అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తారు.
• ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించబడతాయి.
• అమ్మవారి మహిమ గురించి గ్రామస్థులు ఎన్నో కథలు చెబుతుంటారు, ముఖ్యంగా తల్లి తన భక్తులను కాపాడిన సందర్భాలను.
• భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ మొక్కులను వారి సంప్రదాయం కి తగ్గట్టుగా తీర్చుకుంటారు.
• భక్తుల నమ్మిక ప్రకారం, అమ్మవారికి భక్తి తో కొంగు ఒడి పెట్టి మొక్కుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని అంటారు.
Comments
Post Your Comment
Public Comments: