Viral Video : Men Drive SUV Cars Into Sea For Reels, Gets Trapped In Water
రీల్స్ కోసం సముద్రంలోకి థార్ కార్లు తీసుకెళ్లిన యువకులు
సోషల్ మీడియాలో వైరల్ అవడం కోసం రీల్స్ కోసం జనాలు ప్రాణాలకు తెగిస్తున్నారు. ఎన్నోసార్లు రీల్స్ చేయడం కోసం ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.తాజాగా గుజరాత్ కచ్‌లోని ముంద్రా సముద్రతీరంలో ఇద్దరు యువకులు రెండు థార్ కార్లను సముద్రంలోకి రీల్స్ కోసమని సుకెళ్ళిన ఘటన జరిగింది.
రీల్స్ కోసం విన్యాసాలు చేయడానికి ఇద్దరు వ్యక్తులు తమ SUVలను సముద్రతీరంలోకి తీసుకెళ్లారు. అలల తాకిడి కారణంగా రెండు వాహనాలు వీల్ టాప్స్ వరకు దాదాపు నీటిలో మునిగిపోయాయి. వాహనాల్లోకి కూడా నీరు చేరుకోవటం వలన వాహనాలతో పాటు యువకులు కూడా మునిగిపోతున్న క్రమంలో అక్కడున్న స్థానికులు గుర్తించి వారిని కాపాడి అనంతరం కార్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
స్టార్ కమెడియన్‌తో మీనాక్షి చౌదరి..!
ఈ ఘటన తరువాత ఇద్దరు యువకులిద్దరూ తమ కార్లను అక్కడే వదిలి వెళ్లిపోవడంతో కచ్ పోలీసులు రెండు థార్ కార్లను స్వాధీనం చేసుకున్నామని, ఆ ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కార్ల రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా యజమాని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు
Comments
Post Your Comment
Public Comments: