Meenakshi Chaudhary with santhanam
స్టార్ కమెడియన్‌తో మీనాక్షి చౌదరి..!
చిన్న సినిమాలతో కెరీర్‌ను మొదలు పెట్టిన మీనాక్షి చౌదరి క్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తుంది. వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న మీనాక్షి తమిళ స్టార్ కమెడియన్ సంతానం చిత్రంలో ఫీమేల్ లీడ్‌గా కనిపించనున్నది. ఇప్పటికే 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' కిలాడి లాంటి హిట్ సినిమాలు చేసింది. మిళ స్టార్ హీరో విజయ్ దళపతి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్, దుల్కర్ సల్మాన్ తో లక్కీ భాస్కర్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నది.
తాజాగా సంతానం హీరోగా చేస్తున్న “దిల్లుకు దుడ్డు-3” మూవీలో హీరోయిన్‌గా మీనాక్షిని తీసుకున్నారని టాక్. సినిమాను కోలీవుడ్ హీరో ఆర్య నిర్మిస్తుండగా ప్రేమానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఐతే మీనాక్షి కమెడియన్ సరసన నటించడం కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. హీరో కమెడియన్ సంతానం అని చూడకుండా తనకు పాత్ర నచ్చడంతోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తున్నది.
మీనాక్షి ప్రస్తుతం ఐదు సినిమాల్లో నటిస్తున్నది. తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా మట్కా, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర'తో పాటు తమిళస్టార్ హీరో విజయ్‌తో గోట్ మూవీలో జతకట్టబోతున్నది. ఒక వైపు సినిమాలతో ఫుల్ బిజీగా మరో వైపు సోషల్ మీడియాలో తన అందమైన ఫొటోషూట్స్‌తో అలరిస్తుంది.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: