Amarnath Yatra To Begin From June 29 Amid Tight Security

News

views 24

Jun 24th,2024

అమర్‌నాథ్‌ యాత్ర..... కట్టుదిట్టంగా భద్రత

ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది జూన్ 29న ప్రారంభం కానున్న అమర్‌నాథ్‌ యాత్రకు జమ్మూ-కశ్మీర్​లో ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతున్నందున భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ నెల 29 నుండి ఆగస్టు 19 వరకు ఈ యాత్ర కొనసాగనుంది.

ఈ ఏడాది ఐదు లక్షల మందికిపైగా భక్తులు సముద్ర మట్టానికి 12 వేల 700 అడుగుల ఎత్తులో కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు రానున్నట్లు అధికారులు అంచనా.  ఉగ్ర ఘటనల నేపథ్యంలో అమర్‌నాథ్‌ యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా వర్చువల్‌గా సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

స్టార్‌ కమెడియన్‌తోమీనాక్షి చౌదరి..!

ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర చర్యలు చేపట్టేలా సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలని సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రహదారులు మూసివేయడం లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు అవసరమైన సౌకర్యాలతో 17  తాత్కాలిక వసతి శిబిరాలను ఏర్పాటు చేసారు. అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం ప్రథమ పూజను నిర్వహిస్తారు.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...