Let's worship clay Ganesha idols: Puvvada Ajay Kumar

మట్టి గణేష్ ప్రతిమలనే పూజిద్దాం: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేసారు. వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో మట్టి గణపతులనే పూజించి, కాలుష్య పెంపును నివారిద్దామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలో కలకత్తా కళాకారులచే రూపొందించబడిన మట్టి గణపతి విగ్రహాల విక్రయ స్టాల్ ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
కాలుష్యం లేని పర్యావరణ హితం కోరే ఏకో ఫ్రెండ్లీ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మట్టితో తయారు చేసిన విగ్రహాల వల్ల ఎలాంటి హాని ఉండదన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇతర రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్నారు. ముఖ్యంగా నీరు కలుషితమై జలచరాల ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు.
పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలని, పర్యావరణహితం కొరకు రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించి మట్టి విగ్రహాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్ఛయంతో వుందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆద్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పర్యావరణానికి మేలు చేయాలంటే మట్టి, గోమయ గణపతి ప్రతిమలను ప్రతిష్టించి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన, అందమైన సమాజాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.
Watch Full Video
Comments
Post Your Comment
Public Comments: