India's largest floating 100-MW solar power project Ramagundam #RenewableEnergy
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ గారు నేడు పెద్దపల్లి జిల్లా రామగుండం నందు రు. 423 కోట్ల వ్యయంతో, 100 మెగావాట్ల సామర్థ్యంతో, ఎన్టీపీసీ జలాశయంలోని 600 ఎకరాలలో NTPC నిర్మించిన దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ PV ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో ఉపయోగించిన 4.5 లక్షలకు పైగా సోలార్ PV ప్యానెళ్లను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం క్రింద దేశంలోనే తయారు చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చు.

పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుంది మరియు 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధిస్తుంది.ఇటువంటి పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణం.
#RenewableEnergy

Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: