Radhe Shyam to release on March 11 - #RadheShyam

ఎవరితో క్లాష్ కాకుండా చాలా జాగ్రత్తగా జాగ్రత్తగా వస్తున్న రాధే శ్యామ్ నిర్మాతలు ప్రభాస్ అభిమానులకు సినిమా విడుదల తేదిని ప్రకటిస్తూ పోస్టర్ విడుదల చేసి గుడ్ న్యూస్ చెప్పారు.పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ మూకుమ్మడిగా దర్శక నిర్మాతలు బ్లాక్ చేయటంతో, 24 గంటల నుంచి తెలుగు ఇండస్ట్రీ అంతా హోరెత్తిపోతుంది. ఈ లిస్టు లో ట్రిపుల్ ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట, ఎఫ్ 3, భీమ్లా నాయక్ ఉన్నాయి.
పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న రాధే శ్యామ్ రిలీజ్ డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
రాధే శ్యామ్ నుంచి ఇప్పటి వరకు విడుదలైన పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాధే శ్యామ్ సినిమాకి సంబంధించిన అధికారిక పోస్టర్ లో మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ఇండియన్ సినిమా హిస్టరీలో వేర్వేరు సంగీత దర్శకులు ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో పని చేయడం ఇదే తొలిసారి. ఏది ఏమైనా ప్రభాస్ అబిమనులకి మాత్రం ఇదో పెద్ద పడుగాలా మరిపోయింది.
Comments
Post Your Comment
Public Comments: