Uber Ride For Covid19 action

News

views 5

Mar 5th,2021

కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోవడానికి రిజిస్టర్ చేసుకున్నవాళ్ళకి ఇంటి నుంచి వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఊబెర్ ట్యాక్సీలో ఉచితంగా వెళ్లొచ్చు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకున్నాక ఇంటికి కూడా ఉచితంగానే ఊబెర్ ట్యాక్సీలో ప్రయాణించొచ్చని ఊబెర్ ఈ  ఆఫర్ ప్రకటించింది.భారతదేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ రెండో దశ కొనసాగుతున్న తరుణంలో ఊబెర్ రూ.10 కోట్ల విలువైన ఫ్రీ రైడ్స్ ప్రకటించింది. వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లే 60 ఏళ్ల పైబడ్డ వృద్ధులకు, 45 ఏళ్లు పైబడ్డ రోగులకు ఊబెర్ ప్రకటించిన ఆఫర్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇందుకోసం ప్రోమో కోడ్ ఉపయోగిస్తే చాలు. ఉచితంగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి, వ్యాక్సిన్ తీసుకొని, తిరిగి ఇంటికి రావొచ్చు. వృద్ధులను వ్యాక్సినేషన్ సెంటర్‌కు తీసుకొచ్చేందుకు ఊబెర్ రాబిన్‌హుడ్ ఆర్మీ లాంటి స్వచ్ఛంద సంస్థలతో కలిసిపనిచేస్తోంది. దేశవ్యాప్తంగా మార్చి 8 నుంచి 35 నగరాల్లో ఉచిత రైడ్స్ అందించనుంది ఊబెర్. గరిష్టంగా రూ.150 విలువైన ఫ్రీ రైడ్ పొందొచ్చు. అంతకన్నా ఎక్కువ ఫేర్ అయితే మిగతాది చెల్లించాల్సి ఉంటుంది. ఒకరు గరిష్టంగా రెండుసార్లు ఈ రైడ్ పొందొచ్చు.

ఊబెర్‌లో ఫ్రీ రైడ్ ఎలా క్లెయిమ్ చేయాలో చుడండి :--

స్మార్ట్‌ఫోన్‌లో ఊబెర్ యాప్ ఓపెన్ చేసి > Wallet పైన క్లిక్ చేయండి > ఆ తర్వాత Add Promo Code పైన క్లిక్ చేయండి > వ్యాక్సినేషన్‌కి సంబంధించిన ప్రోమో కోడ్ ఎంటర్ చేయండి.

ఈ ప్రోమోకోడ్ ఉపయోగించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సెంటర్‌కు ఉచితంగా వెళ్లి రావొచ్చు.వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు యాప్‌లో, సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు చేపట్టింది ఊబెర్. దీంతో పాటు మాస్కులు ఉపయోగించాలని, సోషల్ డిస్టెన్స్ పాటించాలని, వ్యాక్సినేషన్ తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేస్తోంది అంతే కాకుండా తమ డ్రైవర్లకు కూడా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వాన్ని కోరింది ఊబెర్.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...