అమితాబ్ బచ్చన్ మరియు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా వైరస్ సోకిన సంగతి తెలిసిందే. అమితాబ్‌కు పాజిటివ్ అని తేలడంతో శనివారం ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేశారు.అభిషేక్ బచ్చన్‌కు కూడా కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావటం వల్లనా ఆయన కూడా తండ్రితో పాటే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే జయా బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్యకు శనివారం యాంటిజెన్ టెస్ట్ చేయగా నెగిటివ్ వచ్చింది కానీ వీరి స్వాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఆదివారం వచ్చాయి. ఈ రిపోర్ట్స్‌లో ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్ అని తేలింది.జయా బచ్చన్‌కు మాత్రం నెగిటివ్ వచ్చింది. అలాగే, తన పిల్లలతో కలిసి అమితాబ్ ఇంట్లోనే ఉంటోన్న ఆయన కుమార్తె శ్వేతా నంద ఫ్యామిలీకి కూడా కరోనా టెస్ట్‌లు చేశారు. ఈ పరీక్షల్లో శ్వేతా నంద, ఆమె కుమారుడు అగస్త్య నంద, కుమార్తె నవ్య నవేలికి కొవిడ్ నెగిటివ్ వచ్చింది. ఇదిలా ఉంటే, బచ్చన్ బంగ్లా 'జల్సా'ను బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించి ఆదివారం ఉదయం బంగ్లాను బీఎంసీ కార్మికులు పూర్తిగా శానిటైజ్ చేశారు.
Comments
Post Your Comment
Public Comments: