India Elected Unopposed To UNSC

ఎనిమిదోసారి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్య దేశంగా అవతరించింది. ప్రస్తుత పరిస్థితులలో ఇది భరత్ కి మరో విజయం దక్కింది. 193 మంది సభ్యుల సర్వసభ్య సమావేశంలో 184 భారత్ ఓట్లు సాధించింది.భారత్‌తో పాటు, ఐర్లాండ్, మెక్సికో, నార్వే కూడా బుధవారం జరిగిన భద్రతా మండలి ఎన్నికల్లో విజయం సాధించాయి. ఐక్యరాజ్య సమితి 75వ వార్షికోత్సవ వేడుకలు ఈ అద్బుత విజయానికి వేదికయ్యాయి. దీంతో 2021 నుండి 2022 వరకు రెండేళ్ల పాటు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఆసియా-పసిఫిక్ రీజన్ నుంచి భారత్ నాన్ పర్మినెంట్ మెంబర్‌గా కొనసాగనుంది.ఆసియా- ఫసిఫిక్ గ్రూప్ నుంచి 55 మంది సభ్యులున్న కేవలం భారత్ ఒక్కటే పోటీ చేసింది. ఐక్యరాజ్యసమితి తన 75వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో భరత్ ఇప్పటివరకు 1950-51, 1967-68, 1972-73, 1077-78, 1984-85, 1991-92, 2011-22 వరకు ఎనిమిదిసార్లు తాత్కాలిక సభ్యదేశ హోదా దక్కించుకుంది. 193 సభ్యదేశాలు సమితో ఉండగా, మండలిలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ శాశ్వత సభ్య దేశాలు. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్ ద్వారా ఎంపిక చేస్తుంది.శాశ్వత సభ్యదేశాలకు 'వీటో' అధికారం ఉంటుంది.మండలిలో ఏదైన నిర్ణయం తీసుకుంటే వాటికి 9 సభ్యదేశాల ఆమోదం అవసరం.
Comments
Post Your Comment
Public Comments: