IPL వాయిదా...నిరాశ లో క్రికెట్ అభిమానులు...

Sports

views 178

Mar 27th,2020

 క్రికెట్ అభిమానులకి ఓ బ్యాడ్ న్యూస్ . IPL వాయిదా అయ్యే అవకాశాలే ఎక్కువ.అవుననే సమాధానం వినిపిస్తోంది.అక్టోబర్‌-నవంబర్ నెలల్లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని ఐసీసీ బావిస్తోంది.గత మూడేళ్లుగా ఐసీసీ, బీసీసీఐ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోన్న సంగతి తెలిసిందే.దీంతో ఎలాగైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)ను బుజ్జగించి వచ్చే ఏడాదికి ప్రపంచకప్ ను వాయిదా వేయాలని ఐసీసీ పట్టుదలతో ఉంది. టీ20 వరల్డ్‌కప్ వాయిదా విషయమై ఇప్పటికే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో చర్చిస్తున్న ఐసీసీ.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పెద్దలతోనూ చర్చించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాకి టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కుల్ని ఇస్తే.. ఆ తర్వాత 2022లో భారత్‌లో టీ20 ప్రపంచకప్‌ నిర్వహించకోచ్చని ప్రతిపాదించే అవకాశం ఉంది. ఎందుకంటే.. 2022లో ఎలాంటి ఐసీసీ టోర్నీలు లేవు. ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-13వ సీజన్ వాయిదా వల్ల నష్టపోయిన బీసీసీఐ ఐసీసీ ప్రతిపాదనకు ఎలా స్పందిస్తుందో  చూడాలి.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...