ఐసోలేషన్ వార్డులో నుంచి కే షీట్'తో సహా పరారైన యువకుడు
గురువారం రాత్రి కరోనా లక్షణాలతో చేరిన ఒక యువకుడు గుంటూరు ప్రభుతాసుపత్రిలో నుంచి ఆస్పత్రిలో ఆయనకు సంబంధించిన 'కే షీట్'తో పరారయ్యాడు. ఈ విషయాన్నిఆసుపత్రి ఆర్‌ఎంవో ఆదినారాయణ గారు శుక్రవారం గుంటూరు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు జలుబు, జ్వరంతో ఈ నెల 25న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రాగా అతన్ని ఐసోలేషన్ వార్డులో ఉంచారు. రక్తనమూనాలు పరీక్షకు పంపారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల్లో అతనికి కరోనా లక్షణాలు లేవని వెల్లడయిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ బాబూలాల్ తెలిపారు.
Comments
Post Your Comment
Public Comments: