IPL 2024 KKR Vs LSG : పూనకలు పుట్టించిన స్టార్క్.. పూరన్

Sports

views 0

Apr 14th,2024

IPL 2024 KKR Vs LSG : ఈరోజు ఐపీఎల్ 2024 టోర్నీలో కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ లో శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ కు దిగిన LSGLSGLSG నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ తొలి రెండు బంతుల్లో ఫోర్లు కొట్టినా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. వైభవ్ అరోరా 10 పరుగుల వద్ద దీపక్ హుడా కూడా 8 పరుగులకి ఆ తర్వాత కేఎల్ రాహుల్, ఆయుష్ బదానీ 37 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన కేఎల్ రాహుల్ భారీ షాట్‌కు ప్రయత్నించి రసెల్ బౌలింగ్‌లో రమణదీప్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఎన్నో అంచనాలున్నా మార్కస్‌ స్టోయినిస్‌ 5 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 10 పరుగులు చేసి అవుట్ఐ పూర్తిగా నిరాశపర్చాడు.  ఆయుష్ బడోని 27 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 29 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ 32 బంతుల్లో 45 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్వింటన్ డి కాక్ స్థానంలో అర్షద్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా 4 బంతుల్లో 5 పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్ లో పెవిలియన్ చేరారు. కృనాల్ పాండ్యా 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ స్టార్క్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. వైభవ్ అరోరా, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీశారు.

కోల్‌కతా నైట్ రైడర్స్:

శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా.

ఇంపాక్ట్ ప్లేయర్స్:

సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, మనీష్ పాండే, రహ్మానుల్లా గుర్బాజ్, రింకూ సింగ్.

లక్నో సూపర్ జెయింట్స్:

కేఎల్ రాహుల్ (కెప్టెన్ మరియు వికెట్ కీపర్), క్వింటన్ డి కాక్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, షమర్ జోసెఫ్, మొహ్సిన్ ఖాన్.

ఇంపాక్ట్ ప్లేయర్స్:

అర్షద్ ఖాన్, ప్రేరక్ మన్కడ్, ఎం సిద్ధార్థ్, అమిత్ మిశ్రా, కె గౌతం.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...