Y+ category security cover to Madhavi Latha

Politics

views 18

Apr 7th,2024

బీజేపీ అభ్యర్థి మాధవీలత హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న పోటి చేస్తున్న నేపధ్యం లో కేంద్రం ఆమెకి Y+ సెక్యూరిటీ కల్పించింది. ఆరుగురు సీఆర్పీఎఫ్ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమె వెంట ఉండగా, ఐదుగురు గార్డులు ఆమె నివాసం వద్ద సెక్యూరిటీగా ఉండనున్నారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి అసదుద్దీన్ పై పోటీ చేస్తున్న నేపధ్యం లో మాధవీలతకి  వీఐపీ సెక్యూరిటీలో భాగంగా 11 మందితో భద్రత కల్పించింది. రాజాసింగ్ తనకు సెక్యూరిటీ కల్పించాలని కేంద్ర హోం శాఖకు పలుమార్లు లేఖ రాసినా రెస్పాన్స్ రాలేదు కానీ మాధవీలతకు సెక్యూరిటీ అంశం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దాడులు జరిగిన కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కార్యకర్తలు కోరినా సెక్యూరిటీ ఇవ్వలేదు. బండి సంజయ్ మరియు రాజాసింగ్ ఇద్దరు నేతలకు భద్రత కల్పించని కేంద్రం మాధవీలతకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించడం పలు చర్చలకి దారి తీస్తుంది.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...