Ind Vs Eng 1st Match Live Updates: తొలి టెస్టులో టీమిండియా ఓటమి

Ind Vs Eng 1st Test Day 4 Live Updates:
భారత్-ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో 5 టెస్ట్ సిరీస్ లో భాగంగా జరిగిన నాలుగో రోజుల మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్ అద్భుతమైన బ్యాటింగ్ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చతికిల పడింది. నువ్వా-నేనా అన్నట్టుగా జరిగిన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం టీమిండియా బ్యాటర్లు విఫలం చెందారు. అశ్విన్, సిరాజ్ స్టంప్ ఔట్ కాకుంటే టీమిండియా విజయం సాధించి ఉండేది. ఇంగ్లండ్ నిర్దేశించిన 231 టార్గెట్ ఛేదించలేకపోయిన టీమిండియా పై 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఇంగ్లండ్ బౌలర్ హార్ట్ లీ 7 వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ శర్మ (39), భరత్, అశ్విన్ మినహా టీమిండియా బ్యాటర్లు ఎక్కువ స్కోర్ సాధించలేకపోయారు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగులు చేసి ఆలౌటైంది. జడేజా (87), కేఎల్ రాహుల్ (86), యశస్వి జైస్వాల్ (80) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 4, రెహాన్ అహ్మద్, హార్ట్లీ తలో 2 వికెట్లు, లీచ్ ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Post Your Comment
Public Comments: