Actress Poonam Kaur Tweet About Pawan Kalyan Going Viral
పవన్ కల్యాణ్ కు పూనమ్ కౌర్ కు మధ్య చాలా ఏండ్లుగా టాలీవుడ్ లో ఏదో తెలియని వార్ జరుగుతోంది. పవన్ ను టార్గెట్ చేస్తూ పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేస్తోంది. అప్పట్లో కత్తి మహేశ్ మాట్లాడుతూ పూనమ్ కౌర్ జీవితాన్ని త్రివిక్రమ్, పవన్ కలిసి నాశనం చేశారంటూ ఆరోపించాడు. పోసాని కృష్ణ మురళి కూడా ఇలాంటి ఆరోపణలే చేశాడు కానీ ఏనాడూ కూడా పవన్ ఆమె మీద స్పందించలేదు. ఈ ఆరోపణలను పూనమ్ కౌర్ ఫ్యామిలీ ఖండించినా పూనమ్ మాత్రం పవన్ ను వదిలిపెట్టట్లేదు. తాజాగా గురుపౌర్ణమి సందర్భంగా పవన్ ను గురు అంటూ సంబోదిస్తూ బండ్ల గణేశ్ చేసిన ఓ ట్వీట్ కి మరోసారి పవన్ మీద రెచ్చిపోయింది.
బండ్ల ట్వీట్ కు పూనమ్ కౌర్ కౌంటర్..
నా గురువు పవన్ పేరు వాడుకుని ఇక నుంచి లబ్ది పొందను. మీరు ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటున్నా అంటూ రాసుకొచ్చాడు. అయితే ఇలా గురువు అని పిలవడంపై పూనమ్ కౌర్ ఓ పోస్టు పెట్టింది. ప్రతి అడ్డమైన వాడిని గురువు అని పిలవకండి. స్టేజి మీద నీతులు చెప్పి జీవితాలు నాశనం చేసే వాడు మీ గురువు కాదు. మీ జీవితాలకు ఓ దారి చూపించేవాడే మీ గురువు. కాబట్టి ఎవరిని పడితే వారిని గురువు అని పిలవకండి అంటూ ఇన్ డైరెక్టుగా బండ్ల గణేశ్ ట్వీట్ ను ఉద్దేశించి ఆమె పోస్టు పెట్టింది. ఇది క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. ఆమె కావాలనే పవన్ మీద ఇలాంటి కామెంట్లు చేసిందని కొందరు ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: