550 మందికి పిల్లలకి ఒక్కడే తండ్రి... ఆవేదనతో కోర్టుకెక్కిన తల్లి

నెదర్లాండ్స్ కు చెందిన ఓ వైద్యుడు వీర్య దానం తో ఏకంగా 550 మంది పిల్లలకు తండ్రయ్యాడు. డచ్ కి చెందిన ఒక సంస్థ తో పాటు మరో మహిళ కూడా ఇక నుంచి అతను వీర్యం దానం చేయకుండా అడ్డుకోవాలని కోర్టులో దావా వేసింది.
41 ఏళ్ల జోనాథన్ నెదర్లాండ్స్ తో పాటు అంతర్జాతీయంగా 13 ఆస్పత్రుల్లో వీర్యం దానం చేశాడు. కోర్టుల దావా వేసిన మహిళ కూడా జోనాథన్ వీర్యంతోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే అతను 550 మంది పిల్లలకు పరోక్షంగా తండ్రయ్యాడు కాబట్టి అతనికి ఎక్కువ మంది పిల్లలు పుట్టకుండా ముందు జాగ్రత్త చర్యలు విధించాలని కోర్టును కోరింది. వీర్యదానం చేయడం ద్వారా 100 మంది పిల్లకు తండ్రయ్యాడు. అతనిపై నిషేధం విధించకపోవడంతో ఇప్పుడు ఆ సంఖ్య 550కి చేరింది. నిబంధనల ప్రకారం స్పెర్మ్ డోనార్స్ 25 కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండకూడదు లేదా 12 కంటే ఎక్కువ మంది తల్లులను గర్భం దాల్చకూడదు.
11 విభిన్న సంతానోత్పత్తి క్లినిక్‌లలో 102 మంది పిల్లలకు 2017లో అతను తండ్రయ్యాడని జోనాథన్ ని నెదర్లాండ్స్‌లో బ్లాక్‌లిస్ట్ లో పెట్టారు. జోనాథన్ మాత్రం ఇంటర్నెట్ ద్వారా స్పెర్మ్ దానం చేయడం కొనసాగించాడు. . అతని ప్రవర్తన దాత పిల్లల మానసిక, శారీరక శ్రేయస్సుకు ముప్పు కలిగిస్తుంది" అని అతని చర్యలు చట్టవిరుద్ధమని డోనార్‌కైండ్ తరఫున న్యాయవాది వాదించాడు
Comments
Post Your Comment
Public Comments: