#Major Movie Twitter Review:

Movie News

views 68

Jun 2nd,2022

ముంబై  26/11 టెర్రరిస్ట్ దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళం భాషలలో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

అడివి శేష్ మేజర్ సందీప్ పాత్రలో నటించగా అతని తల్లితండ్రులుగా ప్రకాష్ రాజ్, రేవతి నటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరుడి జీవిత కథ ఇప్పుడు వెండితెరపై ఆవిష్కృతమైంది. ఇప్పటికే ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.

మేజర్ అంటే సినిమా కాదని.. ఎమోషన్.. మేజర్ సినిమా క్లైమాక్స్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడి కంట కన్నీరు వచ్చిందని డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం బాగుందంటూ శేష్ అద్భుతంగా  ఆక్టింగ్ బాగుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో శోభితా ధూళిపాళ్ల, సాయి మంజ్రెకర్ కీలకపాత్రలలో నటించగా డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ సొంత నిర్మాణ సంస్థ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...