Russia-Ukraine War: Pm Modi Speaks To Putin

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపధ్యంలో ప్రధాని మోడీ గురువారం రాత్రి ఫోన్ ద్వారా రష్యా అధ్యక్షులు పుతిన్‌తో సంభాషించారు. ప్రధాని మోడీ ఫోన్ సంభాషణ పుతిన్ సంభాషణ ఒక ప్రకటన ద్వారా వివరాలు వెల్లడించింది ప్రధానమంత్రి కార్యాలయం. ఉద్రిక్తతల నేపధ్యంలో తక్షణమే సైనిక చర్యను నిలిపివేయాలని ప్రధాని మోడీ పుతిన్‌కు విజ్ఞప్తి చేసినట్లుతెలిపింది. దౌత్యపరమైన చర్యల ద్వారా పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావాలని మోడీ పిలుపునిచ్చారు. రష్యా, నాటో కూటమి మధ్య విభేదాలు నిజాయితీతో కూడిన చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించబడతాయని మోడీ పునరుద్ఘాటించారు.
Comments
Post Your Comment
Public Comments: