అమెజాన్ డెలివరీ సర్వీసులు స్టార్ట్...

News

views 3

Mar 30th,2020

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ తమ డెలివరీ సర్వీసులను నిలిపివేసిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా ఉన్న పలు నగరాలు, పట్టణాల్లో అమెజాన్ డెలివరీ సేవలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అయితే అమెజాన్ సంస్థ తమ డెలివరీ సర్వీసులను ఏయే ప్రాంతాల్లో డెలివరీ సేవలు ప్రస్తుతం లభ్యమవుతున్నాయో ఆ ప్రాంతాల లిస్ట్‌ను విడుదల చేసింది.

హైదరాబాద్, బెంగళూరుభువనేశ్వర్, గురుగ్రాం, జైపూర్, జంషెడ్‌పూర్, లక్నో, లూథియానా, మొహాలీ, మైసూరు, పాట్నా, రాయ్‌పూర్ ప్రాంతాలలో త సేవలు అందు బాటులో ఉంటాయని తెలియ చేసారు.

వినియోగదారులు ఈ విషయాన్ని ముందుగా తెలుసుకుని వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉంటుందని  పైన తెలిపిన ప్రాంతాల్లోని పలు ఎంపిక చేసిన పిన్ కోడ్లలోనే ప్రస్తుతం డెలివరీ సేవలను అందిస్తున్నట్లు అమెజాన్ తెలియజేసింది. కానీ ప్రీపెయిడ్ విధానంలో చేసిన ఆర్డర్లను మాత్రమే ప్రస్తుతం ప్రాసెస్‌ చేస్తున్నామని నిత్యావసర వస్తువులను మాత్రమే వినియోగదారులకు ప్రస్తుతం డెలివరీ చేస్తున్నామని వినియోగదారులకు కావల్సిన నిత్యావసరాలను వారి ఇళ్లకే డెలివరీ చేస్తున్నామని కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటూ తమ సేవలని వినియోగదారులకి అందిస్తామని తెలియచేసారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...