Russia-Ukraine War Crisis : Shot down 5 Russian planes, helicopter in Luhansk claims Ukraine
Russia Ukraine War Crisis : రష్యన్ ఆర్మీ మూడు వైపుల నుంచి చుట్టుముట్టింది రాజధాని కీవ్‌తో పాటు పలు నగరాలపై బాంబుల వర్షం కురిపించి పలు నగరాలను తమ గుప్పిట్లోకి తెచ్చుకుంది. రష్యన్ ఆర్మీ బాంబులు విసరడంతో పేలుడు ధాటికి చాలా చోట్ల భవానాలు మరియు కీవ్‌లో ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న మీడియో లు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి.
ఉక్రెయిన్ కూడా రష్యాను ఎదుర్కొనేందుకు శాయశక్తులా పోరాడుతోంది. ఈ నేపధ్యంలో ఉక్రెయిన్ సేన రష్యాకు చెందిన ఐదు యుద్ధ విమానాలతో పాటు ఓ హెలికాప్టర్‌ను కూల్చేసినట్లు ప్రకటిచిది. ఐక్యరాజ్యసమితి ఇది దురాక్రమణ అని రష్యాను అడ్డుకునే బాధ్యత తమకి ఉందని రష్యా దూకుడుకు ప్రపంచ దేశాలు అడ్డుకట్ట వేయ్యాలని విజ్ఞప్తి చేసింది. వాలోదిమిర్ జెలెన్స్కీ మాత్రం ఉక్రెయిన్‌ను కాపాడుకుంటామని తెలిపారు. నాటో దళాలు ఒక్కొక్కటిగా ఉక్రెయిన్‌కు మద్దతుగా సైన్యాన్ని దింపుతున్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్ లోని ప్రజలు భయంతో నగరాన్ని విడిచిపెట్టి వెళ్తున్న క్రమంలో కీవ్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రష్యన్ ఆర్మీ అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేయటంతో ఉక్రెయిన్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అమెరికాతో పాటు నాటో సభ్య దేశాలన్నీ సైనిక చర్యలను ఉపసంహరించుకోవాలని ప్రజల మరణాలకు పుతినే బాధ్యత వహించాలని రష్యా తీరుపై విజ్ఞప్తి చేసింది.
Comments
Post Your Comment
Public Comments: