Russaia Ukraine War Live Updates

అంతా అనుకున్నట్లే యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలైంది. యుక్రెయిన్ లోని పట్టణాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించటంతో ఐక్య రాజ్య సమితి యుక్రెయిన్ పై మిలిటరీ ఆపరేషన్ ఆపాలని విజ్ఞప్తి చేసింది.
గురువారం ఉదయం పుతిన్ జాతినుద్దేశించి ప్రసంగించిన పుతిన్ తమ పౌరులను రక్షించుకోవడానికే ఇది చేస్తున్నట్లు, ఏదైనా రక్తపాతం జరిగితే దానికి ఉక్రెయిన్ పాలకులే బాధ్యతవహించాల్సి ఉంటుందన్నారు . అంతే కాకుండా పొరుగు దేశం నుంచి వస్తున్న బెదిరింపులకు ప్రతిగా మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ మధ్యలో ఎవరూ తలదూర్చినా, ఎవరైనా జోక్యం చేసుకుంటే తగిన పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఏది ఏమైనా రష్యా మాత్రం తను అనుకున్నదే చేసుకుపోతోంది. చివరికి పరియవాసనం ఎలావుంటుందో వేచి చూడాలి.
Comments
Post Your Comment
Public Comments: