జిన్‌పింగ్‌ పెరుగుతున్న అసంతృప్తి...ఎందుకంటే...?

News

views 4

Mar 30th,2020

ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్‌-19 కారణంగా ప్రంపంచంలోని ప్రజలందరు ఇండ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇందుకు కారణం చైనా అని అందరికి తెలిసిన విషయమే. చైనా ఆర్థిక ప్రగతి గత ఏడాది కాలంగా మందగిస్తూ వస్తున్న మందగిస్తున్ననేపధ్యంలో కోవిడ్‌-19 ప్రబలింది. దానివల్ల చైనా ఆర్ధిక వ్యవస్తేకకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే పరిస్థితి ప్రస్తుతం నేఅలకోంది. చైనాలో మావో తర్వాత అలాంటి నాయకత్వ లక్షణాలు కేవలం జి జిన్‌పింగ్‌ కే ఉన్నాయని చైనాలో జీవితకాల నాయకుడుగా ఆమోదించారు. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి కోవిడ్‌-19 కారణంగా చైనాలో లక్షల మందిని బలవంతంగా నిర్బంధంలో ఉంచారు. దీని అంతటికీ  అధ్యక్షుడి నిర్లక్ష్యమే కారణమనే భావన అక్కడి ప్రజల్లో పెరుగుతున్నదని పలు అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి.గత 12 నెలలుగా జిన్‌పింగ్‌ పాపులారిటీకి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ కుంగుబాటు, హాంగ్‌కాంగ్‌లో పౌర ఆందోళనలు, తైవాన్‌తో సమస్యలు, అమెరికా- చైనా మధ్య వాణిజ్య యుద్ధం తదితర సమస్యలు జిన్‌పింగ్‌కు గట్టి సవాళ్లు విసిరాయి అని నీ పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ జిన్‌పింగ్‌ను తమ గోల్డెన్‌ బోయ్‌గా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇప్పటికీ చైనాలోనూ అంతర్జాతీయంగా కూడా ఇదే ప్రచారం చేస్తున్నదని కాన్‌బెర్రా కేంద్రంగా పనిచేస్తున్న చైనా పాలసీ సెంటర్‌ డైరెక్టర్‌ ఆడం నీ విశ్లేషించారు. జిన్‌పింగ్‌ కరోనా వల్ల పోయిన తన ప్రతిష్టను మళ్లీ ఎలా తెచ్చుకుంటారో వేచి చూడాలి మరి.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...