గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు టి.ఎస్.ఆర్టీసీ ఆర్థికాంశాలపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు, స్ఫెషల్ చీఫ్ సెక్రటరీ, టి.ఆర్ అండ్ బి, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సునీల్ శర్మ, ఐ.ఎ.ఎస్ గారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు, ఐ.ఎ.ఎస్ గారు, ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఐ.ఎ.ఎస్ గారు, సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ యాదగిరి గారు, సంస్థ ఆర్థిక సలహాదారు శ్రీ రమేశ్ గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. టి.ఎస్.ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులపై ప్రధానంగా అడిగి తెలుసుకున్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంతో పాటు ఖర్చు, అప్పుల వివరాలపై పూర్తి స్థాయిలో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో సంస్థకు రూ.1500 కోట్లు, అదనంగా మరో రూ.1500 కోట్లు బడ్జెటేతర నిధులను కేటాయించిన విషయం తెలిసిందే. బడ్జెట్లో కేటాయించిన నిధుల్ని ప్రభుత్వం సంస్థకు నెల నెలా సమకూర్చడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా బడ్జెటేతర నిధుల కింద తొలి విడతగా ప్రభుత్వ గ్యారెంటీతో రూ.1000 కోట్లు బ్యాంకు రుణంగా మంజూరు చేయడం జరిగిందని, ఇందులో రూ.500 కోట్లు వచ్చాయని, మరో రూ.500 కోట్లు త్వరలో వస్తామని చెప్పారు. ఈ నిధుల్ని సంస్థ ఆవసరాల కోసం ఎలా వినియోగించాలనే విషయంపై మంత్రి అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. సంస్థ ఆర్థికావసరాలను దృష్టిలో పెట్టుకుని నిధులను కేటాయించడంతో పాటు పదవి విరమణ పొందిన ఉద్యోగుల కోసం కూడా వినియోగించనున్నట్లు వెల్లడించారు. ఇవే కాకుండా ఎన్.సి.డి.సి బ్యాంకు ద్యారా ప్రభుత్వ పూచికత్తుతో మరో రూ.500 కోట్లను లోన్ తీసుకుని సి.సి.ఎస్ బకాయిలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సంస్థ అభ్యున్నతి కోసం ఉద్యోగులు, అధికారులు చేస్తున్న కృషి అభినందనీయమంటూ ప్రస్తుతం టిక్కెట్టు ద్వారా వస్తున్న రూ.9 కోట్లను మరో 2 లేదా 3 కోట్లకు పెంచుకోగలిగితే సంస్థ ఆర్థిక స్థితి కొంత మెరుగు పడగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Post Your Comment
Public Comments: