ప్రజా రవాణా సేవలు అగ్రగామిగా నిలిచిన టిఎస్ఆర్టీసీ సోమవారం సరికొత్త రికార్డును నెలకొల్పింది. గత కొంతకాలంగా కరోనా పరిస్థితులతో పాటు చమురు ధరల పెరుగుదల కారణంగా కుదేలు అయినప్పటికీ సంస్థ ప్రయాణికుల ఆదరణను చూరగొంటునే ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంతగా గత సోమవారం రోజున 78 శాతం ఆక్యుపెన్సీ రేషియోతో 13.04 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సందర్భంగా సూచించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంస్థలోని సిబ్బందిని అధికారులును అభినందిస్తూ ఈ ఘనత ప్రతి ఒక్కరిది అన్నారు. కరోనా గడ్డు పరిస్థితులను తట్టుకొని ప్రజా రవాణా సేవలు అందిస్తూ నమ్మకాన్ని చూరగొంటున్న సంస్థను ప్రయాణికులు మరింత ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బస్సుల నిర్వహణ ద్వారా 78 శాతం ఐఆర్ సాధించడం ఓ మైలురాయి అంటూ సంస్థకు సోమవారం ఒక్కరోజే 13.04 కోట్ల మేర టికెట్ ఆదాయం సమకూరడం సిబ్బంది, అధికారుల ఘనతగా చెప్పుకోవచ్చు అంటూ ప్రశంసించారు. 31.77 లక్షల కిలోమీటర్లు బస్సులను నడిపి 41.05 ఎర్నింగ్ ఫర్ కిలోమీటర్స్ సాధించడం సిబ్బంది పనితీరుకు నిదర్శనం అని కొనియాడారు. కరోనా విపత్కర పరిస్థితులు, డీజిల్ ధరల పెరుగుదల ఒకింత అవరోధాలుగా నిలిచినప్పటికీ టిఎస్ ఆర్టీసీ తన గమ్యాన్ని కొనసాగిస్తూనే ఉందన్నారు.
ప్రతి ఒక్కరి దినచర్యలో ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉంటుందని సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయాణికులు ఆర్టీసీ బస్సులలో ప్రయాణించి మరింత ఆదరించాలని మంత్రి కోరారు. టికెట్ ఆదాయం పెంచుకోవడం ద్వారా సంస్థ కొంత ఆర్థిక పరిపుష్టి సాధించగలదని, ఈ మేరకు సిబ్బంది, అధికారులు ఇదే రకంగా కృషి చేయాలని మంత్రి పువ్వాడ సూచించారు
Comments
Post Your Comment
Public Comments: