Covid-19 4th Wave : ఫ్రాన్స్‌లో ఫోర్త్ వేవ్. కఠిన ఆంక్షలు

News

views 17

Jul 22nd,2021

కొన్ని దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మరికొన్ని దేశాల్లోకి మూడో వేవ్ కొనసాగుతోంది. ఫ్రాన్స్‌లో కరోనా నాల్గో వేవ్ ప్రారంభమైందని కరోనా నాల్గో వేవ్ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో మళ్లీ కఠినమైన ఆంక్షలు విధిస్తున్నట్లు ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధి గాబ్రియేల్ అ‍‍ట్టల్‌ ప్రకటించారు.ఇప్పటికే ఫ్రాన్స్‌లో 21 వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 98 శాతం మంది వ్యాక్సిన్ వేయించుకోని వారే ఉన్నారు. ఒకవైపు టీకా ప్రక్రియను వేగవంతం చేస్తూ వ్యాక్సిన్‌ వేయించుకోని వారికి కఠిన నిబంధనలు ప్రకటించింది.

ఫ్రాన్స్‌లో ఫ్రెంచ్ సినిమాలు, మ్యూజియంలు, క్రీడా వేదికలు, సాంస్కృతిక వేదికలు, ఉద్యానవనాలు, స్విమ్మింగ్ పూల్స్ సందర్శనకు కొవిడ్‌ టీకా ధ్రువీకరణ పత్రం లేదా నెగటివ్ టెస్టును తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. నాల్గో వేవ్ నేపథ్యంలో ఫ్రాన్స్‌లో అమల్లోకి తెచ్చిన వ్యాక్సిన్ పాస్ పోర్ట్ సిస్టమ్ వివాదాస్పదమైంది. దీన్ని హెల్త్ పాస్ అని కూడా పిలుస్తారు. దీని ప్రకారం.. ప్రజలందరూ టీకాలను వేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే నిబంధనలకు కచ్చితంగా పాటించాలి. ఆగస్టులో ప్రారంభమయ్యే రెస్టారెంట్లు, కెఫేలు, షాపింగ్ సెంటర్లలు, బార్లు, రైళ్లు, విమానాల్లో ప్రయాణం సహా అన్ని ప్రదేశాల్లో 50 మంది కంటే ఎక్కువ మంది ఉంటే తప్పనిసరిగా హెల్త్ పాస్ చూపించాలి.

టీకా వేసుకున్న వారికి మాత్రమే హెల్త్‌పాస్‌ను జారీచేస్తారని ప్రధాని జీన్ కాస్టెక్స్‌ (Jean Castex) తెలిపారు. ఫ్రాన్స్ లో గత 24 గంటల్లో 21వేల కరోనా కేసులు నమోదయ్యాయి. మే ఆరంభం నుంచి అత్యధిక స్థాయిలో పెరిగినట్టు నివేదిక పేర్కొంది. దేశవ్యాప్తంగా నాల్గో లాక్ డౌన్ విధించకుండా హెల్త్ పాస్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చినట్టు ప్రధాని జీన్ తెలిపారు. ప్రజలు టీకాలు వేసుకునేలా పోత్సహించేందుకు ఈ హెల్త్‌ పాస్‌ను ప్రవేశపెట్టినట్లు ఆయన చెప్పారు.

హెల్త్‌ పాస్ నిబంధనలు గౌరవించని వారికి 1500 యూరోలు, తొలిసారి ఉల్లంఘించిన వారికి 7,500 యూరోలు జరిమానా, మూడోసారి ఉల్లంఘించిన వారికి 9 వేల యూరోల జరిమానా విధించనున్నారు. అలాగే ఏడాది జైలు శిక్ష విధించనున్నట్లు ఫ్రాన్స్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఫ్రాన్స్ 56 శాతం మంది జనాభాలో దాదాపు 38మిలియన్ల మందికి కనీసం ఒక డోస్ వ్యాక్సిన్ అందుకున్నట్టు కొవిడ్ ట్రాకర్ డేటా వెల్లడించింది. దాదాపు 45శాతం మంది పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నట్టు తెలిపింది.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...