రోడ్డుపై కూర్చోబెట్టి రసాయనాలు చల్లారు..
లాక్‌డౌన్‌తో వలస కార్మికులు పనులు లేకపోవడంతో సొంతూళ్లకు వెళ్లలేక నరకం చూస్తున్నారు.రాత్రింబవళ్లు నడిచి రాష్ట్రాల సరిహద్దులు దాటుతు వందల కిలోమీటర్ల కాలినడకనే వెళ్తున్నారు. కానీ సొంత రాష్ట్రానికి చేరుకున్న వారికి కొన్నిచోట్ల చేదు అనుభవం ఎదురవుతోంది. యూపీలో లోకి అడుగుపెట్టిన వలస కార్మికులందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి శానిటైజర్లు, రసాయనాలతో పిచికారీ చేశారు.వలస కార్మికుల జీవితాలు దుర్భరంగా మారాయి. పనులు లేకపోవడంతో నగరాల్లో ఉండలేక.. సొంతూళ్లకు వెళ్లలేక నరకం చూస్తున్నారు. కొందరైతే వందల కిలోమీటర్ల కాలినడక వెళ్తున్నారు. రాత్రింబవళ్లు నడిచి రాష్ట్రాల సరిహద్దులు దాటుతున్నారు. ఎలాగోలా సొంత రాష్ట్రానికి చేరుకున్న వారికి కొన్నిచోట్ల చేదు అనుభవం ఎదురవుతోంది. యూపీలో దారుణ ఘటన జరిగింది. రాష్ట్రంలోకి అడుగుపెట్టిన వలస కార్మికుల పట్ల అధికారులు అమానుషంగా ప్రవర్తించారు. అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి శానిటైజర్లు, రసాయనాలతో పిచికారీ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇప్పటికే కేంద్రం వలస కార్మికులను ప్రస్తుతం ఉంటున్న చోటే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని దేశించింది.యూపీ అధికారులు అలా అందరినీ రోడ్డుపై కూర్చోబెట్టి వారిపై రసాయనాలు చల్లటం వలన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Udaya Sree Entertainments
Comments
Post Your Comment
Public Comments: