ఫేక్ కరోనా సర్టిఫికెట్ పుట్టించిన అఖిలప్రియ భర్త

News

views 19

Jul 10th,2021

ప్రవీణ్ రావు సోదరులు అపహణ కేసులో న్యాయస్ధానానికి హాజరుకావటం ఇష్టంలేని భార్గవ్ రామ్ నకిలీ కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ సమర్పించి న్యాయ విచారణకు హజరు కాకుండా తప్పించుకున్నాడని అతనిపై బోయినపల్లి పోలీసు స్టేషన్ లో కేసు నమోదయ్యింది. నిజంగానే కరోనా పాజిటివ్ వచ్చిందని నమ్మారు పోలీసులు కానీ… ఆ సర్టిఫికెట్ పై విచారణ చేపట్టగా అది ఫేక్ సర్టిఫికెట్ అని తేలింది. దీంతో రిపోర్టు ఇచ్చిన గాయత్రి ల్యాబరేటరీ లైసెన్స్ రద్దు చేయాలని వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాశారు.భార్గవరామ్ గత శనివారం కోర్టు విచారణకు హాజరు కాలేనంటూ బోయినపల్లి ఇన్ స్పెక్టర్ రవికుమార్ కు వాట్సప్ లో మెసేజ్ పంపించాడు. న్యాయస్ధానంలో ఈ విషయం వివరించేందుకు ఎస్సై ఈ సర్టిఫికెట్ ను తన ఉన్నతాధికారులకు పంపించాడు. అందులో పేర్లు , అక్షరాలలో దిద్దుబాట్లు ఉన్నట్లు చూసిన ఉన్నతాధికారులు గుర్తించారు. రిపోర్టు ఇచ్చిన కూకట్ పల్లిలోని గాయత్రీ ల్యాబరేటరీకి వెళ్లి ల్యాబ్ నిర్వాహకులు వినయ్, రత్నాకర రావులను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో వివరించగా రూ. 1200 తీసుకుని పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినట్లు వారు వివరించారు.అఖిల ప్రియ తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి భార్గవ్ రామ్ కు కరోనా పాజిటివ్ సర్టిఫికెట్ రావటానికి 10 రోజుల క్రితమే ప్లాన్ వేశాడు. కూకట్ పల్లిలోని ప్రతిమ ఆస్పత్రిలో పని చేస్తున్నవినయ్ అనే వ్యక్తి తనకు తెలుసని అతడికి చెబితే పనై పోతుందని…అడిగినంత డబ్బు ఇచ్చేద్దామని చెప్పాడు. వినయ్ సూచన మేరకు భార్గవ్ రామ్ గాయత్రి ల్యాబరేటరీకి వెళ్ళి కోవిడ్ పరీక్షలు చేయించుకోగా నెగెటివ్ రాగా వారు పాజిటివ్ అని తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చారు.విచారణ జరిపిన పోలీసులు ల్యాబ్ లో మొత్తం వ్యవహరాన్ని కూపీ లాగారు. భార్గవ రామ్ కు సంబంధించి మొత్తం సీసీటీవీ ఫుటేజిని పరిశీలించారు. ఒక నమూనా బదులు వేరోక నమూనా ఉంచటం…కోవిడ్ రిపోర్ట్ పై పాజిటివ్ అని రాయటం వంటి వాటి ఆధారాలు సేకరించారు. పరారీలో ఉన్నభార్గవ్ రామ్, జగద్విఖ్యాత రెడ్డిల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...