Space rock hurtling towards Earth

News

views 5

Jul 22nd,2021

నాసా అలర్ట్ :

 

చూడటానికి ఎడిన్బర్గ్ కోట అంత ఎత్తు స్టేడియం అంత సైజు భారీ గ్రహశకలం జూలై 24న భూమివైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. సెకనుకు ఎనిమిది కిలోమీటర్ల వేగంతో, గంటకు 17,900mph మిలియన్ల వేగంతో దూసుకురానుంది. ఈ గ్రహశకలాన్ని '2008 GO20' గా పిలుస్తారు. ఈ ఆస్టరాయిడ్ గమనం వేగంలో ఏదైనా అడ్డుగా వస్తే విధ్వంసమైపోతుంది. . ఈ భారీ గ్రహశకలం వైశాల్యం 220 మీటర్ల పరిమాణం ఉంటుంది. ఎడిన్బర్గ్ కోట అంత 135 మీటర్ల ఎత్తు ఉంటుంది. శనివారం రోజున ఈ ఆస్టరాయిడ్ 2008 GO20 భూమి కక్ష్య మీదుగా రాత్రి 8.35 సమయంలో ప్రయాణించనుంది. ఈ గ్రహశకలం భూమికి 28,70,847,607 కిలోమీటర్ల దూరంలో భూమి మీదుగా వెళ్లనుంది.

ఈ గ్రహశకలం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికన్ సైన్స్ ఏజెన్సీ నాసా (NASA) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ గ్రహశకలం జూలై 24న భూమికి అతిదగ్గరగా వెళ్లనుంది. ఇది అపోలో క్లాస్ (Apollo Class) గ్రహశకలంగా పేర్కొంది. ఈ గ్రహశకలం భూమికి చాలా దగ్గరగా వస్తున్నప్పటికి. భూమికి 0.04 au (astronomical unit) దూరం నుంచి వెళ్లనుంది.

 

భూమికి, ఆస్టరాయిడ్‌కి మధ్య 3,718,232 మైళ్ల దూరం ఉండనుంది. అదే చంద్రుడు, భూమికి మధ్య దూరం సుమారు 2,38,606 మైళ్లు ఉంటుంది. గత జూన్ నెలలో ఈఫిల్ టవర్ అంత సైజున్న 2021 KT1 అనే భారీ గ్రహశకలం భూమికి అతిదగ్గరగా వెళ్లింది. భూమికి 4.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో గ్రహశకలం ప్రయాణించింది. భూమికి దగ్గరలో 26వేల గ్రహశకలాలు ఉన్నాయని, అందులో 1000 వరకు అత్యంత ప్రమాదకరమైనవిగా నాసా హెచ్చరిస్తోంది. ఆస్టరాయిడ్స్ సుమారు 4.6 బిలియన్ ఏళ్ల క్రితమే సౌర వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి రాతి అవశేషాలుగా ఉన్నాయి. ప్రస్తుతం విశ్వంలో 1,097,106 గ్రహశకలాలు ఉన్నాయి. ఉల్కల కంటే చాలా భిన్నంగా ఉంటాయి.

 

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...