ఏప్రిల్‌ 14వరకు విమానాల రాకపోకలపై నిషేధం ....?

News

Mar 27th,2020

కరోనాపై పోరులో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈనేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాల రాకపోక లపై నిషేధాన్ని మార్చి 31నుండి ఏప్రిల్‌ 14వరకు పొడిగించారు. ఈ నిర్ణయం తీసుకున్నట్లు పౌర విమానయాన సంస్థ డిజిసిఎ  ఈ నిర్ణయం తీసుకున్నట్లు  తెలిపింది. అంతర్జాతీయ విమానాల రాకపోక లను ఏప్రిల్‌ 15వరకు దేశమంతటా 21రోజుల లాక్‌డౌన్‌ విధించడానికి ముందుగానే నిలిపివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని దేశీయ ఆపరేటర్లందరూ దీన్ని తప్పక అమలు చేయాల్సి వుంటుందని డిజిసిఎ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ సునీల్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం నిత్యావసరాలు, మందుల రవాణా మినహా మరెలాంటి రాకపోకలు జరగకుండా అంతర్రాష్ట్ర రవాణాను కూడా నిలిపివేశారు.కరోనా వైరస్‌ వ్యాప్తి అరికట్టేందుకే లాక్‌డౌన్‌ అవసరమైందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటివరకు 17మంది మరణించగా, 830 పై చిలుకు కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ కారణంగా ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌ బాస్కెట్‌ వంటి ఆన్‌లైన్‌ సంస్థల సేవలను నిలిపివేశారు. దినసరి వేతన కార్మికులు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో వందలాదిమంది ప్రజలు వారి కుటుంబాలు రోజుల తరబడి నడుస్తూ నగరాల నుండి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు.

.