ఐసోలేషన్‌ వార్డులో నుంచి కే షీట్‌'తో సహా పరారైన యువకుడు

News

Mar 27th,2020

గురువారం రాత్రి  కరోనా లక్షణాలతో చేరిన ఒక యువకుడు గుంటూరు ప్రభుతాసుపత్రిలో నుంచి ఆస్పత్రిలో ఆయనకు సంబంధించిన 'కే షీట్‌'తో పరారయ్యాడు. ఈ విషయాన్నిఆసుపత్రి ఆర్‌ఎంవో ఆదినారాయణ గారు శుక్రవారం గుంటూరు కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన యువకుడు జలుబు, జ్వరంతో ఈ నెల 25న గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రాగా అతన్ని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. రక్తనమూనాలు పరీక్షకు పంపారు. యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే వైద్య పరీక్షల్లో అతనికి కరోనా లక్షణాలు లేవని వెల్లడయిందని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ బాబూలాల్‌ తెలిపారు.

.