శివారదనలో చేయకూడని తప్పులు...?

Devotional

views 0

Mar 27th,2020

హిందువులు పూజించే దేవుళ్ళలో శివునికి అత్యంత ప్రాముక్యత ఉంది. శివుడిని బోలా శంకరుడు అని కూడా అంటారు. తన భార్య ఐన పార్వతీ మాతని తనలో సగం అని చూపించిన గొప్పతనం శివునికే దక్కుతుంది. సంస్కృతంలో శివ అనగా సౌమ్యం, శుభం అని అర్థాలు వస్తాయి. పురాణాల ప్రకారం శివునికి సోమవారం ఎంతో ప్రత్యేకమైన రోజు. లింగరూపంలోని శివుడిని పూజించిన వారు జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదుగుతారని వేదాలు చెబుతున్నాయి. భక్తులను శివుడు త్వరగా అనుగ్రహిస్తాడని, కోరిన కోరికలను త్వరగా నెరవేరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి. శివుడిని పూజించే సమయంలో కొన్ని పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లోను చేయకూడదు. శివునికి మూడు ఆకులతో కూడిన బిల్వ పత్రం సమర్పిస్తే మంచి జరుగుతుంది. అష్టమి, నవమి, పౌర్ణమి, మకర సంక్రాంతి, సోమవారం రోజులలో బిల్వ పత్రాలను కోయకూడదు. శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే మనస్సులో భక్తితో ఒక్క బిల్వపత్రాన్ని సమర్పిస్తే చాలు ప్రసంనమైపోతాడు శివలింగానికి కేవలం గంధం మాత్రమే సమర్పించాలి. కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోను ఉపయోగించకూడదు. కుంకుమ శ్రద్ధాభక్తులతో ధ్యానం చేసే శివుడిలో చల్లదనాన్ని కలిగించడానికి బదులు వేడి కలిగిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోను శివలింగంపై కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి. శివునికి వెలగపoడు సమర్పిస్తే దీర్ఘాయుష్షు పొందవచ్చు. శివుడికి సంపంగి పూలను సమర్పించకూడదు. శివుని కంటే ముందు వినాయకుడిని పూజించాలి. ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే చెప్పాడు. శివునికి తులసి ఆకులతో కూడా పూజ చేయకూడదు. శివుడిని పూజించే సమయంలో ఓం నమః శివాయ: అనే పంచాక్షరీ మంత్రం చదివితే మనస్సులో వుండే చెడు తొలగి పోయీ మంచి జరుగుతుంది.

 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...