deksametazon tablets For Coronavirus Treatment - WHO

News

views 4

Jun 17th,2020

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కి హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ లని ఇప్పటివరకు వదిన సంగతి తెలుసు. కానీ ఇప్పుడు  కొవిడ్‌ -19 వల్ల తీవ్రంగా ఆరోగ్యం క్షీణించిన వారికి డెక్సామెథసోన్‌ ట్యాబ్లెట్లు ఇస్తే బ్రతుకుతారు అని డబ్ల్యూహెచ్‌వో చప్తుంది. ఐతే సాధరణ స్థితిలో ఉన్న కరోనా రోగులపై ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపడం లేదని కరోనా వల్ల తీవ్రంగా ఆరోగ్యం క్షీణించిన వారికి మాత్రమే ఈ ట్యాబ్లెట్లు పనిచేస్తాయని WHO తెలిపింది.కొవిడ్‌ -19 వల్ల రోగుల ప్రాణాలను రక్షించే శాస్త్రీయ పురోగతిగా డెక్సామెథసోన్ గా డబ్ల్యూహెచ్‌వో అభివర్ణించింది.

రోగులకు ఈ ట్యాబ్లెట్‌ ఇస్తూ వెంటిలేటర్‌పై పెడితే మూడింట ఒక వంతు, ఆక్సిజన్‌ మాత్రమే అందిస్తే ఐదింట ఒక వంతు మరణాల రేటు తగ్గుతున్నదని కరోనా పాజిటివ్‌గా తేలి చివరి దశలో వెంటిలేటర్‌ మీదున్న రోగులకు డెక్సామెథసోన్‌ అనే ట్యాబ్లెట్‌ ఇవ్వగా వారు కోలుకున్నారని బ్రిటన్‌ వైద్యులు తేల్చారు. టెడ్రోస్‌ అధనామ్ ఆక్సిజన్‌, వెంటిలేటర్‌ ఉపయోగిస్తూ ట్యాబ్లెట్‌ ద్వారా కొవిడ్‌ మరణాల రేటును తగ్గిస్తున్న మొదటి చికిత్స ఇదేనని పేర్కొన్నారు. ఐతే డెక్సామెథసోన్‌ అనేది ఒక స్టెరాయిడ్‌. దీన్ని నొప్పుల నివారణకు 1960వ దశకం నుంచి వాడుతున్నారు. డెక్సామెథసోన్ 1977 నుంచి డబ్ల్యూహెచ్‌వో అత్యవసర మందుల జాబితాలో కొనసాగుతున్నది. దీనికి ఎలాంటి పేటెంట్‌ లేనందున ప్రపంచంలోని చాలా దేశాల్లో అందుబాటు ధరల్లోనే లబించటం ఆనంద పడవలసిన విషయం.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...