AgriGold బాధితులకుCM YS Jagan భరోసా

Politics

views 16

Aug 24th,2021

అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా ఉంటారని, మాట తప్పని మడమ తిప్ఫని నాయకుడు జగన్ అని మరోసారి నిరూపించుకున్నారని రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ అన్నారు.ఏడు లక్షలకు పైగా ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర హైకోర్టు సూచించిన విధంగా వారి వారి బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.666.84 కోట్లను జమ చేశారని ఎంపీ భరత్ రామ్ తెలిపారు.సామాన్యుల జీవన స్థితిగతులు పూర్తిగా తెలిసిన, సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల ఆవేదనను అర్థం చేసుకుని జగనన్న భరోసా ఇవ్వడం వల్ల అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటున్నారన్నారు.ఓ ప్రైవేటు కంపెనీ దగాచేసి మోసం చేసిన ఘటనలలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆదుకున్న దాఖలాలు దేశంలో ఎక్కడా జరగలేదని, మొట్టమొదట ఈ విధంగా స్పందించినది ముఖ్యమంత్రి జగనన్న ఒక్కరేనన్నారు.2019లో దాదాపు మూడున్నర లక్షల మందికి సుమారుగా రూ.240 లక్షలు చెల్లించడం జరిగిందని చెప్పారు.అప్పట్లో రూ.10 వేలు లోపు డిపాజిటర్లు ఇంకా ఎవరికైతే అందలేదో వారికి సుమారు రూ.207.61 కోట్లు, అలాగే రూ.20 వేల లోపు డిపాజిటర్లు 3.14 లక్షల మందికి రూ.459.23 కోట్లు వెరసి రూ.666.84 కోట్లను దాదాపు ఏడు లక్షల మందికి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చెల్లించిందని చెప్పారు.ఈ క్రెడిట్ సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎంపీ భరత్ రామ్ అన్నారు.గతంలో టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు ఏ విధంగానూ సహాయం చేయకుండా కాలయాపన చేసిందని ఎంపీ భరత్ రామ్ విమర్శించారు.అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకూ జగన్ కంకణ బద్దులయ్యారన్నారు.ఎంతో సమర్ధవంతంగా అగ్రిగోల్డ్ బాధితులను ఆర్ధికంగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ కు ప్రజలంతా అభినందనలు తెలియజేస్తున్నారని ఈ సందర్భంగా ఎంపీ భరత్ రామ్ పేర్కొన్నారు.

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...