Bush Criticizes The Mistake of Withdrawing NATO Forces

News

views 4

Jul 14th,2021

2001లో అమెరికాలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి జరిగిన తర్వాత అప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బుష్ అఫ్ఘానిస్తాన్ దళాలు పంపారు. అప్పటి నుంచి అఫ్ఘాన్ లో ఉగ్రదాడులు తగ్గాయి. నాటో బలగాలను ఉపసంహరణపై పలువురు ప్రముఖులు స్పందించారు.అఫ్ఘానిస్తాన్ నుంచి నాటో దళాల ఉపసంహరణ మొదలైన నాటి నుంచి అఫ్ఘానిస్తాన్ లో దాడులు పెరిగిపోయాయి.అఫ్ఘాన్ లోని చాలా భాగాలను తాలిబన్ తీవ్రవాద సంస్థ తమ ఆధీనంలోకి తీసుకుంది. అఫ్ఘాన్ దళాలపై దాడి చేసి దేశంలోని చాలా ప్రాంతాలను తమ స్వాధీనం లోకి తీసుకున్నారు. ఇది అనాలోచిత చర్య అని అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ అభిప్రాయపడ్డారు. అఫ్ఘాన్ ను తాలిబన్ లకు వదిలేసినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఆ ప్రజల్ని తాలిబన్లు నరికేస్తారని జార్జ్ బుష్ హెచ్చరించారు. అఫ్ఘానీ మహిళలు, అమ్మాయిలు.. చెప్పలేనటువంటి కష్టాలను ఎదుర్కొంటారని, ఇది పొరపాటు అని, చాలా క్రూరమైన తాలిబన్లు వాళ్లను హతమారుస్తారని, ఇది తన గుండెను కలిచివేస్తోందని జార్జ్ బుష్ తెలిపారు. కొత్తగా ఎన్నికైన జో బైడెన్ దళాలను వెనక్కు పిలవడంతో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 

Comments

Post Your Comment
max 200 character length.
Public Comments:
Be the first person to comment on this article...